ఒక సెల్ఫీ... 50 మాత్రమే

ఒక సెల్ఫీ... 50 మాత్రమే
x
Highlights

ఈ మధ్య కాలంలో చాలామంది స్మార్ట్ ఫోన్లనే ఎక్కువగా వాడుతున్నారు. ఆ స్మార్ట్ ఫోన్ లలో హై క్వాలిటీ గల కెమెరాలు ఉండడంతో ఏదైనా మంచి సన్నివేశం కనిపిస్తే...


ఈ మధ్య కాలంలో చాలామంది స్మార్ట్ ఫోన్లనే ఎక్కువగా వాడుతున్నారు. ఆ స్మార్ట్ ఫోన్ లలో హై క్వాలిటీ గల కెమెరాలు ఉండడంతో ఏదైనా మంచి సన్నివేశం కనిపిస్తే చాలు అక్కడకి వెళ్లి వారి ఫోన్లలో సెల్పీ దిగి వారి ఫోన్లలో భద్రపరుచుకుంటున్నారు.

అయితే ఇప్పుడు దీన్నే తన జీవనాధారంగా చేసుకుంటున్నాడు ఓ పౌరాణిక కళాకారుడు. ప్రస్తుతం కాలానుగుణంగా వీధి నాటకాలు, అలాగే పౌరానిక నాటకాలు కనుమరుగయ్యాయి. ఎక్కడ చూసినా సినిమాలే కనిపిస్తున్నాయి. అంత టెక్నాలజీ వచ్చినా ఓ యువకుడికి మాత్రం నాటకాలంటే చాలా ఇష్టం. ఆ నాటకాలకు ఆదరణ తగ్గిపోవడంతో ఆ యువకుడు వివిధ వేశధారణలను వేసుకుని తనతో ఒక సెల్ఫీ దిగాలనుకుంటే కేవలం 50రూ. చెల్లించండి అని తన మెడలో ఒక బోర్డును తగిలించుకుని పట్టణంలో తిరుగున్నాడు. ఇంతకీ ఇంత వింత ఆలోచనని చేసిన యువకుడు ఎవరా అనుకుంటున్నారా.

అతని పేరు నూకాజీ, తన స్వస్థలం తుని. అతను ఎల్ ఎల్ బీ వరకు చదువున్నాడు. ఎంత చదుకున్నా అతనికి మాత్రం నాటకాల పైనే మోజెక్కువ. ఆ నాటకాలనే నమ్ముకున్న ఆయన బతుకు దెరువుకోసం హైదరాబాద్‌కు చేరుకున్నాడు. నాటకాలలో వేసుకున్న మాదిరిగానే రాముడిలా, హనుమంతునిలా చాలా వేషధారణలు వేసి నగరంలో తిరగడం మొదలు పెట్టాడు. అతని ఆలోచన అక్కడున్న వారందరినీ ఆకట్టుకుంది. దీంతో తనతో సెల్ఫీ దిగాలంటే రూ.50 చెల్లించాలంటూ మెడలో ఓ బోర్డును తగిలించుకున్నాడు. క్యాష్ మాత్రమే కాదు డిజిటల్ పేమెంట్స్ తీసుకునే ఫెసిలిటీ కూడా అతను ఏర్పరుచున్నాడు.

దీంతో అతన్ని చూసి ముచ్చటపడిన కొందరు సెల్ఫీ ప్రియులు నూకాజీతో సెల్ఫీ దిగి రూ.100, రూ.200, రూ.500 కూడా ఇస్తున్నారు. ఈ విధంగా అతను రోజుకు వెయ్యి రూపాయల వరకు సంపాదిస్తున్నట్టు చెప్పాడు. ఏదైతేనేం ఈ యువకుడి ఒక చిన్న ఐడియా తన జీవితాన్నే మార్చేసింది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories