ఎర్రచందనం కోసం స్మగ్లర్ల కొత్త ఎత్తుగడ

ఎర్రచందనం కోసం స్మగ్లర్ల కొత్త ఎత్తుగడ
x
Highlights

తిరుమల శేషాచలం అడవుల్లో పందికొక్కుల్లా మారి ఎర్ర చందనం లూటీ చేస్తున్న స్మగ్లర్ల ఆగడాలకు అడ్డూ, అదుపు లేకుండా పోతోంది. శేషాచలం అడవుల్లో స్మగ్లర్లు...

తిరుమల శేషాచలం అడవుల్లో పందికొక్కుల్లా మారి ఎర్ర చందనం లూటీ చేస్తున్న స్మగ్లర్ల ఆగడాలకు అడ్డూ, అదుపు లేకుండా పోతోంది. శేషాచలం అడవుల్లో స్మగ్లర్లు పెద్ద మాస్టర్ ప్లాన్ తోనే అడుగు పెడుతున్నారు. పైకి చూసే వారికి వెంకన్న భక్తుల్లా నటిస్తూనే సైలెంట్ గా దుంగలను తరలించుకు పోతున్నారు. దీనికోసం పకడ్బందీ డ్రెస్సింగ్ కూడా వేసుకుంటున్నారు. ఎప్పుడు ఎక్కడ ఎవరికి కనిపించినా ఎవరికీ అనుమానం రాకుండా తమ వెంట మూడు రంగుల డ్రెస్సులు తెచ్చుకుంటున్నారు.

చిత్రంలో వ్యక్తి ఎర్ర చందనం స్మగ్లర్ చూడటానికి బక్క పలచగా ఊపిరి లేకుండా ఉన్న ఈ స్మగ్లర్ మారువేషంలో శేషాచలం అడవుల్లో సంచరిస్తున్నాడు. టాస్క్ ఫోర్స్ సిబ్బందికి పట్టుబడిన ఈ స్మగ్లర్ బ్యాగ్ ను తనిఖీ చేయగా అందులో మూడు రంగుల దుస్తులు ఉన్నాయి. ఒకటి బస్సులో వచ్చినప్పుడు యాత్రికుడిలా కనిపించేందుకు తెల్లరంగు దుస్తులు, శ్రీవారి మెట్ల మార్గం దగ్గర సంచరించేటప్పుడు కాషాయరంగు దుస్తులు, అలాగే అడవిలో సంచరించడానికి మరో జత తెచ్చుకున్నాడు. టాస్క్ ఫోర్స్ సిబ్బంది తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. నిందితుడిని తమిళనాడు తిరువన్నామలై జిల్లా జమునా మత్తూరు, వెళ్లి చెరువు గ్రామానికి చెందిన కె.వెంకటేశన్ గా గుర్తించారు. ఆరాతీస్తే ఎర్రచందనం దుంగల కోసమే వచ్చినట్లు అంగీకరించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అంతకుముందు శేషా చలం అడవుల్లో టాస్క్ ఫోర్స్ సిబ్బంది శ్రీవారి మెట్టు దగ్గర కూంబింగ్ చేస్తుండగా 15 మంది స్మగ్లర్లు అడవిలోకి ప్రవేశించడం గమనించారు. వారిని అడ్డుకోగా 14 మంది పారిపోగా ఒక వ్యక్తి మాత్రం పట్టుబడ్డాడు.


Show Full Article
Print Article
Next Story
More Stories