దివ్య తేజస్విని కేసులో మరో ట్విస్ట్.. దివ్య ఇన్ స్టా గ్రామ్ వీడియోలో కొత్త విషయాలు

దివ్య తేజస్విని కేసులో మరో ట్విస్ట్.. దివ్య ఇన్ స్టా గ్రామ్ వీడియోలో కొత్త విషయాలు
x
Highlights

దివ్య తేజస్విని కేసు క్షణానికో మలుపు తిరుగుతోంది. తాను రెండేళ్లుగా రిలేషన్ షిప్ లో ఉన్నట్లు దివ్య రికార్డు చేసుకున్న ఓ ఇన్ స్టా గ్రామ్ వీడియో ఒకటి...

దివ్య తేజస్విని కేసు క్షణానికో మలుపు తిరుగుతోంది. తాను రెండేళ్లుగా రిలేషన్ షిప్ లో ఉన్నట్లు దివ్య రికార్డు చేసుకున్న ఓ ఇన్ స్టా గ్రామ్ వీడియో ఒకటి బయటకొచ్చింది. అక్టోబర్ 3న రికార్డయినట్లుగా ఉన్న ఆ వీడియోలో దివ్య తన మనసులోని ఆవేదనను షేర్ చేసుకుంది. తాను రెండేళ్లుగా రిలేషన్ షిప్ లో ఉన్నానని కానీ అతడు సైకో అని తెలిసాక దూరం పెట్టాననీ దివ్య అందులో చెప్పింది. తన కెరీర్ ను నాశనం చేయాలని చూస్తున్నాడని, ఆరునెలలుగా అతనితో ఇబ్బందులు పడుతున్నానని దివ్య ఆవేదన వ్యక్తం చేసింది. అంతే కాదు ఓ మహిళ ద్వారా తాను మోసపోయినట్లు అయినా తాను ఈ ఇబ్బందిని అధిగమిస్తానని తల్లి దండ్రుల కలలు నెరవేరుస్తానని స్ట్రాంగ్ గా ఉంటాననీ చెప్పింది.

మరోవైపు దివ్య నాగేంద్రతో మాట్లాడిన ఫోన్ కాల్స్ రికార్డింగులు కూడా ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. తన మనసులోని సంఘర్షణను ఎవరితోనూ పంచుకోలేకపోతున్నానని పెళ్లి వ్యవహారం దాచడం కష్టంగా అనిపిస్తోందనీ, ఎవరికి చెప్పాలో తెలియడం లేదని, దివ్య నాగేంద్రతో ఫోన్లో అన్నట్లు సమాచారం. ఎవరి సలహా తీసుకోవాలో ఎవరికి చెప్పాలో అర్ధం కావడం లేదనీ, తనకు కెరీర్, నాగేంద్ర ఇద్దరూ ఇంపార్టెంటే అని అన్నట్లు తెలుస్తోంది. అయితే ఇది వారిద్దరి మధ్య సంబంధాలు బలంగా ఉన్నప్పటి ఆడియో రికార్డింగుల్లా కనిపిస్తున్నాయి. ఈ సంభాషణలు నాగేంద్రతో దివ్య అనుబంధం బాగున్నప్పటి ఆడియోలుగా భావిస్తున్నారు. ఈ ఫోన్ కాల్ రికార్డింగ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories