విజయనగరం జిల్లాలో ఒమిక్రాన్‌ కలకలం.. ఐర్లాండ్‌ నుంచి వచ్చిన వ్యక్తికి..

Vizianagaram: కోవిడ్‌ పరీక్షలు చేయించుకోకుండా తిరుపతి వెళ్లిన వ్యక్తి...

Shireesha
Published on: 7 Dec 2021 12:28 PM IST
Omicron Variant Case Tension in Vizianagaram District | Omicron Live Updates
X

విజయనగరం జిల్లాలో ఒమిక్రాన్‌ కలకలం.. ఐర్లాండ్‌ నుంచి వచ్చిన వ్యక్తికి..

Vizianagaram: విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో ఒమిక్రాన్‌ కలకలం రేగింది. ఐర్లాండ్‌ నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్‌ అంటూ పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ముంబై ఎయిర్‌పోర్టులో దిగి కోవిడ్‌ పరీక్షలు చేయించుకోకుండా తిరుపతికి ఓ వ్యక్తి వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. అక్కడి నుంచి ఆవ్యక్తి నేరుగా శృంగవరపుకోటలోని తన అత్తగారి ఇంటికి చేరుకున్నట్లు గుర్తించారు.

ముంబై ఎయిర్‌పోర్టు అధికారుల సమాచారంతో ఆవ్యక్తికి కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, టెస్ట్‌లో పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే.. ఆవ్యక్తికి ఒమిక్రాన్‌కు సంబంధించి ఎలాంటి లక్షణాలు లేవని వైద్యులు చెప్పారు.

Shireesha

Shireesha

Next Story