జనసేన శ్రమదానం ప్రకటనకు దిగొచ్చిన ఏపీ సర్కార్

Jana Sena: జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటన ఎఫెక్ట్‌తో అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది.

Arun Chilukuri
Updated on: 30 Sept 2021 9:15 PM IST
Officials Start Repairs for Dawaleswaram Barrage Bridge Amid Jana Senas Shramadanam
X

జనసేన శ్రమదానం ప్రకటనకు దిగొచ్చిన ఏపీ సర్కార్

Jana Sena: జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటన ఎఫెక్ట్‌తో అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. అక్టోబర్ 2న ధవళేశ్వరం బ్యారేజ్‌ వంతెనపై శ్రమదానం చేసి తీరుతామన్న జనసేన కామెంట్లతో అధికారులు హుటాహుటిన బ్రిడ్జ్ మరమ్మత్తులు చేపట్టారు. అకస్మాత్తుగా రోడ్డు మరమ్మత్తులు చేపట్టడం హాట్‌టాపిక్ అవుతోంది.

జనసేనాని పర్యటనతో హటాత్తుగా అధికారులు కదిలొచ్చారు. నెలల తరబడి గుంతమయంగా ఉన్నా పట్టించుకోని యంత్రాంగం జనసేనాని పర్యటనతో ఉటాహుటిన రంగంలోకి దిగిపోయింది. ఇప్పటివరకూ మానవతా దృక్పధంతోనే రాకపోకలకు అనుమత్తిస్తున్నాం అని చెప్పారు అధికారులు. అయితే జనసేన శ్రమదానం చేసి తీరుతాం అని తేల్చి చెప్పారు. దీంతో అధికార యంత్రాంగం జనసేనాని పర్యటనకు ముందే రోడ్డుకు మరమ్మత్తు చేపట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో జనసేన శ్రేణులు ఎలా రియాక్ట్ అవుతారన్నది హాట్ టాపిక్ అవుతోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story