ఎట్టకేలకు ఇప్పటంలో వైఎస్ విగ్రహాన్ని తొలగించిన అధికారులు

YSR Statue: గుంటూరు జిల్లా ఇప్పటంలో వైఎస్సార్ విగ్రహాన్ని అధికారులు తొలగించారు.

Arun Chilukuri
Updated on: 7 Nov 2022 6:31 PM IST
Officials Removed YSR Statue in Ippatam
X

ఎట్టకేలకు ఇప్పటంలో వైఎస్ విగ్రహాన్ని తొలగించిన అధికారులు

YSR Statue: గుంటూరు జిల్లా ఇప్పటంలో వైఎస్సార్ విగ్రహాన్ని అధికారులు తొలగించారు. క్రేన్ సాయంతో విగ్రహాన్ని తరలించారు. ఇటీవల ఇప్పటంలో రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్లను అధికారులు కూల్చివేశారు. గాంధీ, నెహ్రూ వంటి మహానుభావుల విగ్రహాలను తొలగించారు. ఇళ్ల కూల్చివేతపై జనసేనాని పవన్ కల్యాణ్ ఇటీవల ఇప్పటంలో పర్యటించారు. గ్రామస్తులను పరామర్శించిన పవన్ వై.ఎస్. విగ్రహాన్ని ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. ముళ్ల కంచెల ద్వారా విగ్రహానికి పోలీసు బందోబస్తుపై విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై సెటైర్లు రావడంతో స్పందించిన అధికారులు వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story