Machilipatnam YSRCP Office: మచిలీపట్నం వైసీపీ ఆఫీసుకు నోటీసులు

Machilipatnam YSRCP Office: మచిలీపట్నం వైసీపీ ఆఫీసుకు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ అధికారులు నోటీసులు ఇచ్చారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 28 Jun 2024 2:00 PM IST
Officials Notice To YCP Office in Machilipatnam
X

Machilipatnam: మచిలీపట్నం వైసీపీ ఆఫీసుకు నోటీసులు

Machilipatnam YSRCP Office: మచిలీపట్నం వైసీపీ ఆఫీసుకు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ అధికారులు నోటీసులు ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపడుతున్నారని మున్సిపల్ కార్పోరేషన్​ కమిషనర్ నోటీసులు ఇచ్చారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని అందుబాటులో లేకపోవడంతో కొత్త భవనానికి నోటీసులు అంటించారు. వెయ్యి చదరపు గజాల విస్తీర్ణం దాటిన భవనాలకు అర్బన్ డెవలప్‌మెంట్ అనుమతి తప్పనిసరి అని అధికారులు అంటున్నారు.

ఇప్పటికే చాలా చోట్ల నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన వైసీపీ కార్యాలయాలపై వివరణ కోరుతూ అధికారులు నోటీసులు జారీ చేశారు. విజయవాడ విద్యా ధరపురంలో నిర్మాణ దశలో ఉన్న వైసీపీ కార్యాలయానికి కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్​ నోటీసులు ఇచ్చారు. వైఎస్సార్సీపీ నేతలు బాధ్యులెవరూ అందుబాటులో లేకపోవడంతో అధికారులు భవనాలకు నోటీసులు అంటిస్తున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story