Anantapur: ఆధార్ అప్డేట్ చేయమంటే.. బతికున్న వ్యక్తిని..

Anantapur: అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణానికి చెందిన ఐటిఐ విద్యార్ధి చంగల సాయిరాజ్ కు వింత అనుభవం ఎదురైంది.

Arun Chilukuri
Published on: 4 Oct 2021 7:48 PM IST
Officers Updated that the Living Person is Dead in Aadhaar Card in Anantapur
X

Anantapur: ఆధార్ అప్డేట్ చేయమంటే.. బతికున్న వ్యక్తిని..

Anantapur: అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణానికి చెందిన ఐటిఐ విద్యార్ధి చంగల సాయిరాజ్ కు వింత అనుభవం ఎదురైంది. ఐటిఐ కళాశాలలో విద్యాదీవెన కోసం ఆధార్ కార్డ్ అప్డేట్ చేయాలన్న కాలేజీ అధికారుల సూచన మేరకు ఫిబ్రవరి 15న ఆధార్ కేంద్రంలో అప్డేట్ చేయించాడు. ఫిబ్రవరి 22న సాయిరాజ్ ఫోన్ కు మెస్సేజ్ వచ్చింది.

మీరు నమోదు చేసిన ఆధార్ నెంబర్ గల సభ్యుడు మరణించినట్లుగా థృవీకరించడ మైనది అన్న మెసేజ్ చూసి సాయిరాజ్ కంగు తిన్నాడు. 8 నెలలుగా రేషన్ రావడం లేదని, విద్యా దీవెన కోసం అప్లయ్ చేసుకుంటే బతికున్న వాళ్లని అప్డేషన్ పేరుతో చంపేస్తున్నారని సాయిరాజ్ ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులు స్పందించి తప్పును సరిదిద్దాలని కోరుతున్నాడు సాయిరాజ్.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story