logo
ఆంధ్రప్రదేశ్

పంచాయతీ ఎన్నికల సమరానికి యంత్రాంగం సన్నద్ధం

పంచాయతీ ఎన్నికల సమరానికి యంత్రాంగం సన్నద్ధం
X

పంచాయతీ ఎన్నికల సమరానికి యంత్రాంగం సన్నద్ధం

Highlights

పంచాయతీ ఎన్నికల సమరానికి యంత్రాంగం సన్నద్ధమవుతోంది.

పంచాయతీ ఎన్నికల సమరానికి యంత్రాంగం సన్నద్ధమవుతోంది. అనంతపురంలో పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు పోలింగ్ బాక్సులతో పాటు సామాగ్రిని అధికారులు సిద్ధం చేస్తున్నారు. నగరంలోని జడ్పీ కార్యాలయంలో ఉన్న తొమ్మిది వేల బాక్సులను అధికారులు మరమ్మతులు చేసి సిద్ధం చేశారు. ఓటర్ల సంఖ్య ను బట్టి పోలింగ్ కేంద్రాలకు పంపనున్నారు.

జిల్లాలో మొదటి విడత లో కదిరి, పుట్టపర్తి నియోజకవర్గాల్లోని 12 మండలాల్లో 167 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. మరో వైపు జిల్లా ఉన్నతాధికారులు, ఆర్డీవోలు, డీఎస్పీలు, మండల స్థాయి అధికారులతో జిల్లా ఎన్నికల అధికారి గంధం చంద్రుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో తీసుకోవలసిన జాగ్రత్తల పై మార్గదర్శకం చేశారు.

Web Titleofficers ready for the panchayat election
Next Story