Badvel: బద్వేలు ఉప ఎన్నిక ఏర్పాట్లలో అధికారులు

Badvel: అధికారులతో సమీక్ష జరిపిన ఏపీ ఎన్నికల అధికారి విజయానంద్

Sandeep Eggoju
Updated on: 22 Oct 2021 1:56 PM IST
Officers Completing the Arrangements to Badvel By-Elections
X

బద్వేల్ ఉపఎన్నిక ఏర్పాట్లు పూర్తి చేస్తున్న అధికారులు (ఫైల్ ఇమేజ్)

Badvel: కడప జిల్లాలోని బద్వేలు ఉప ఎన్నికలో ప్రశాంత వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి విజయానంద్ స్పష్టం చేశారు. కడప పర్యటనలో భాగంగా కలెక్టరేట్ లో ఆయన ఎన్నికల నిర్వహణపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. కోవిడ్ నేపథ్యంలో పోలింగ్ సమయాన్ని పెంచామన్నారాయన. ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవచ్చు అని తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని, 200 లోకేషన్ లలో 148 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story