NV Ramana: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్నఎన్వీ రమణ

NV Ramana: స్వామి సేవలో కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్

Jyothi
Published on: 12 Nov 2023 8:37 AM IST
Nv Ramana Will Visit Srisailam Bhramaramba Mallikarjuna Swamy Temple
X

NV Ramana: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్నఎన్వీ రమణ

NV Ramana: శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారిని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్. వి రమణ దంపతులు, కర్ణాటక డిప్యూటీ సీఎం డి.కె.శివకుమార్ దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న న్యాయమూర్తి, డిప్యూటీ సీఎంకు ఆలయ మర్యాదలను అనుసరించి అర్చకులు, వేదపండితులు ఆలయ ఈవో పెద్దిరాజు, ఆలయ ఛైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి అధికారులు ఘన స్వాగతం పలికారు.

అనంతరం న్యాయమూర్తి ఎన్.వి రమణ దంపతులు డి.కె.శివకుమార్ శ్రీస్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. దర్శనం అనంతరం ఎన్.వి రమణ దంపతులు, కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్‌కు అమ్మవారి ఆశీర్వచన అందించారు.

Jyothi

Jyothi

Next Story