తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ, హైకోర్టు సీజే

NV Ramana: అభిషేక సేవలో పాల్గొన్న సీజేఐ, హైకోర్టు సీజే

Jyothi
Published on: 19 Aug 2022 11:20 AM IST
NV Ramana Visits Tirumala
X

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ, హైకోర్టు సీజే  

NV Ramana: తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ ర‌మ‌ణ దర్శించుకున్నారు. ఇవాళ వేకువజామున సుప్రభాతం అభిషేక సేవలో కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో తరించారు. సుప్రీంకోర్టు సీజే వెంట తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ కూడా అభిషేక సేవలో పాల్గొన్నారు. వీరికి ఆలయ మహా ద్వారం వద్ద టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వాదం పలుకగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Jyothi

Jyothi

Next Story