Nuzvid PS: డబ్బులు, రికవరీ ప్రాపర్టీతో ఉడాయించిన రైటర్‌ జానార్ధన్‌

* నిన్నటి నుండి విధులకు హాజరుకాని జనార్ధన్‌ నాయుడు * ఇంటికి తాళం వేయడంతోపాటు ఫోన్‌ ఆఫ్‌ చేసిన రైటర్‌ జనార్ధన్‌

Sandeep Reddy
Updated on: 2 Sept 2021 6:33 PM IST
Nuzvid Police Station Police Station Writer Janardhan Naidu Escaped With Recovery Money
X

నూజివీడు పీఎస్‌ (ఫైల్ ఫోటో)

Nuzvid Police Station: కృష్ణా జిల్లా నూజివీడు పీఎస్‌కు చెందిన రైటర్‌ జనార్ధన్‌ నాయుడు పరారయినట్లు తెలుస్తోంది. పీఎస్‌లో ఉన్న డబ్బు, రికవరీ ప్రాపర్టీతో ఉడాయించినట్లు సమాచారం. నిన్నటి నుండి జనార్ధన్‌ విధులకు హాజరుకాకపోవడంతో అనుమానం వచ్చిన తోటి ఉద్యోగులు జనార్ధన్‌ ఇంటికి వెళ్లారు. కాగా జనార్ధన్‌ తన ఇంటికి తాళం వేసినట్లు గమనించి పైఅధికారులకు సమాచారం అందించారు. అటు జనార్ధన్‌ ఫోన్‌ కూడా ఆఫ్‌ చేసినట్లు తెలుస్తోంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story