శిరోముండనం కేసులో నూతన్‌నాయుడు అరెస్ట్

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన శిరోముండనం కేసులో సినీ నిర్మాత నూతన్‌నాయుడును పోలీసులు...
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన శిరోముండనం కేసులో సినీ నిర్మాత నూతన్‌నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటకలోని ఉడిపిలో నూతన్‌నాయుడిని అరెస్ట్ చేసినట్లు విశాఖ సీపీ మనీష్ కుమార్ సిన్హా వెల్లడించారు. కేసు వెలుగుచూసినప్పటి నుంచి పరారీలో ఉన్న అతన్ని కర్ణాటకలోని ఉడిపిలో శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ముంబైకి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో పోలీసులకు పట్టుబడ్డాడని సీపీ మనీష్‌కుమార్ సిన్హా వెల్లడించారు. శిరోముండనం కేసులో నూతన్ నాయుడు పాత్ర ఉందని తేలిన తరువాతనే అతన్ని అరెస్ట్ చేశామన్నారు.
దళిత యువకుడి శిరోముండనం కేసులో నూతన్‌నాయుడు భార్య మధుప్రియ సహ ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపామన్నారు. ఘటన జరిగిన రోజు 6 సెల్‌ఫోన్స్ సీజ్ చేశామని నూతన్ భార్య సమక్షంలోనే దళిత యువకుడికి శిరోముండనం జరిగిందని సీపీ వెల్లడించారు. సీసీ ఫుటేజీతో పాటు కీలక ఆధారాలు సేకరించామని మనీష్‌కుమార్ సిన్హా వెల్లడించారు. తన భార్యను కేసు నుంచి తప్పించడానికి సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవి రమేష్ పేరిట నూతన్ నాయుడు పలువురు అధికారులకు ఫోన్‌చేసి మోసగించినట్టు పోలీసులు గుర్తించారు. శిరోమండనము ఘటనకు ముందు వెనుక నూతన్ నాయుడు భార్యతో వీడియో కాల్‌లో మాట్లాడినట్లు తేలింది. దర్యాప్తులో మిగిలిన విషయాలు వెల్లడవుతాయని సీపీ చెప్పారు.
'ఆవో-దేఖో-సీకో'.. ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ
1 July 2022 12:15 PM GMTకుప్పం అభ్యర్థిపై మంత్రి పెద్దిరెడ్డి క్లారిటీ
30 Jun 2022 8:54 AM GMTసీఎం కేసీఆర్ కు ఈటల జమున సవాల్.. నిరూపిస్తే ముక్కు నేలకు రాయటానికి సిద్ధం..
30 Jun 2022 8:39 AM GMTమోడీకి స్థానిక వంటకాలు..యాదమ్మ చేతి వంట రుచి చూడనున్న ప్రధాని..
30 Jun 2022 7:55 AM GMTTelangana SSC Results 2022: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల
30 Jun 2022 6:32 AM GMTకేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు చంద్రబాబు లేఖ
29 Jun 2022 10:36 AM GMTNiranjan Reddy: బీజేపీ టూరిస్ట్‌లు నెల రోజులకు ఓసారి వచ్చి వెళ్తున్నారు
29 Jun 2022 9:26 AM GMT
బీజేపీ జాతీయ స్థాయి కార్యవర్గ సమావేశాలకు ముస్తాబైన భాగ్యనగరం
2 July 2022 1:16 AM GMTENG vs IND: బర్మింగ్‌హామ్ టెస్టులో ధాటిగా రాణించిన టీమిండియా
2 July 2022 1:05 AM GMTKishan Reddy: కార్యకర్తలను ఇబ్బంది పెడితే ఊరుకోం..
1 July 2022 4:00 PM GMTEtela Rajender: బీజేపీ ఖాతాలో 20 వ రాష్ట్రంగా తెలంగాణ..
1 July 2022 3:30 PM GMTSuchendra Prasad: కాపురాలు కూల్చడం అలవాటే.. అందుకే వదిలేసింది..
1 July 2022 3:15 PM GMT