NTR Jayanthi: విశాఖలో ఎన్టీఆర్‌ 98వ జయంతి వేడుకలు

NTR Jayanthi: బీచ్‌ రోడ్డులో ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించిన -అచ్చెన్నాయుడు

Sandeep Eggoju
Updated on: 28 May 2021 3:54 PM IST
NTR Birth Anniversary Celebrations in Visakhapatnam
X

ఎన్టీఆర్ జయంతి వేడుకలు (ఫైల్ ఇమేజ్)

NTR Jayanthi:రాజకీయ పార్టీ పెట్టి కేవలం 9నెలల్లోనే అధికారంలోకి వచ్చిన మహానుభావుడు ఎన్టీ రామారావు అని అన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు. ఎన్టీఆర్‌ 98వ జయంతి సందర్భంగా.. విశాఖ బీచ్‌ రోడ్డులోని ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని, బడుగు బలహీనవర్గాల వారికి కూడా రాజకీయాల్లో చోటు కల్పించారని అచ్చెన్న అన్నారు. అలాంటిది.. ఈరోజు ఏపీలో అరాచక పాలన సాగుతోందని, దాడులు, అక్రమ కేసులతో ప్రతిపక్షాలను అణగదొక్కాలనే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు అచ్చెన్న.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story