Sujana Chowdary: విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా సుజనా చౌదరి నామినేషన్

Sujana Chowdary: ఎన్డీయే కూటమి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సుజనా చౌదరి

Shashank Gullapelli
Published on: 18 April 2024 2:44 PM IST
Nomination Of Sujana Chowdary As Candidate For Vijayawada West Constituency
X

Sujana Chowdary: విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా సుజనా చౌదరి నామినేషన్

Sujana Chowdary: విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ఎన్డీఏ కూటమి బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి. పశ్చియ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఐదేళ్లు మాత్రమే కాదని, జీవితాంతం పనిచేస్తానన్నారు సుజనా చౌదరి. వైసీపీ ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. ఎంతో చారిత్రక నేపథ్యమున్న పశ్చిమ నియోజకవర్గ నగరానికి తిరిగి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్నారు. అభివృద్ధి పరంగా దేశంలోనే బెస్ట్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని దీమా వ్యక్తం చేశారు. పేద ప్రజల జీవన ప్రమాణాలు పెంచి వారి రుణం తీర్చుకుంటానన్నారు సుజనా చౌదరి.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story