Nominated Posts: ఏపీలో నామినేటెడ్ పోస్టుల ప్రకటన

Nominated Posts: ష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, హోంమంత్రి సుచరిత రాష్ట్ర జిల్లా స్థాయిలో పోస్టులను విడుదల చేశారు

Sandeep Eggoju
Updated on: 17 July 2021 2:13 PM IST
Nominated Posts Announced in Andhra Pradesh
X

సజ్జల రామకృష్ణ మరియు సుచరిత (ఫైల్ ఇమేజ్)

Nominated Posts: ఏపీలోని ప్రభుత్వ సంస్థల్లో నామినేటెడ్‌ పోస్టులను ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, హోంమంత్రి సుచరిత రాష్ట్ర జిల్లా స్థాయిలో పోస్టులను విడుదల చేశారు. 135 కార్పొరేషన్లు, సంస్థల్లో చైర్మన్లు, డైరెక్టర్లను నియమించారు.

సామాజిక న్యాయం దృష్టిలో ఉంచుకుని పదవుల భర్తీలో జరుగుతుందన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు, నేతలను సీఎం జగన్‌ గుర్తించారన్నారు. పదవులు అలంకారంగా భావించకుండా.. పదవులు వచ్చిన వారు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు సజ్జల.

* సివిల్‌ సప్లై కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా ద్వారంపూడి భాస్కర్‌ రెడ్డి

* టిడ్కో చైర్మన్‌గా జమ్మాన ప్రసన్న కుమార్

* ఆర్టీసీ రీజనల్‌ చైర్మన్‌గా గేదెల బంగారమ్మ

* గ్రంధాలయ సంస్థ చైర్మన్‌గా రెడ్డి పద్మావతి

* కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌గా అడపా శేషు

* బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌గా సుధాకర్

* ఏలేశ్వరం డెవలప్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌గా శైలజ

* ఏపీ గ్రీన్ & బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా రామారావు

* ఉమన్‌ కో-ఆపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా హేమమాలిని

* మారిటైం బోర్డు చైర్మన్‌గా వెంకటరెడ్డి

* డిసిసిబి చైర్మన్‌గా నెక్కల నాయుడు బాబు


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story