త్వరలో లక్ష్మీ పార్వతికి నామినేటెడ్‌ పోస్టు.. అంతలోనే మరో నేత రేసులోకి.. టెన్షన్‌లో లక్ష్మీ పార్వతి వర్గం?

త్వరలో లక్ష్మీ పార్వతికి నామినేటెడ్‌ పోస్టు.. అంతలోనే మరో నేత రేసులోకి.. టెన్షన్‌లో లక్ష్మీ పార్వతి వర్గం?
x
Highlights

ఎన్నికలకు ముందు, పార్టీ తరపున బలంగా వాయిస్ వినిపించిన చాలామందికి పదవులు దక్కాయి. పిలిచి మరీ పోస్టులిచ్చారు వైసీపీ అధినేత, సీఎం జగన్. కానీ ఎన్టీఆర్‌...

ఎన్నికలకు ముందు, పార్టీ తరపున బలంగా వాయిస్ వినిపించిన చాలామందికి పదవులు దక్కాయి. పిలిచి మరీ పోస్టులిచ్చారు వైసీపీ అధినేత, సీఎం జగన్. కానీ ఎన్టీఆర్‌ సతీమణి, లక్ష్మీ పార్వతికి మాత్రం, ఇంత వరకూ, ఎలాంటి పదవి కట్టబెట్టలేదు. అయితే, ఒక పోస్టు ఆమె కొరకు సిద్దమవుతోందన్న ఊహాగానం, అమరావతిలో చక్కర్లు కొడుతోంది. అంతలోనే మరో నేత రేసులోకి రావడంతో, లక్ష్మీ పార్వతి వర్గంలో టెన్షన్‌ మొదలైంది.

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ స్థాపన నాటి నుంచి, వైఎస్ జగన్ వెంటే వున్నారు దివంగత సీఎం ఎన్టీఆర్‌ భార్య లక్ష్మీ పార్వతి. చంద్రబాబుపై ధాటిగా విమర్శలు చేసేందుకు, వైసీపీకి ఒక అస్త్రమయ్యారు. టీవీ చర్చా వేదికలు, బహిరంగ సభలు, ర్యాలీలు, పర్సనల్‌ ఇంటర్వ్యూలు సహా, వేదిక ఏదైనా చంద్రబాబును రకరకాలుగా విమర్శించారు. ఆ విధంగా వైసీపీ మాటలకు మరింత బలమిచ్చేలా ఆమె వాగ్భాణాలు సంధించారు.

ఎన్నికల సమయంలోనూ వైసీపీ వాయిస్‌ను బలంగా వినిపించారు లక్ష్మీ పార్వతి. ఆమెకు గుంటూరులో ఏదైనా నియోజకవర్గం టికెట్ ఇస్తారని అందరూ ఊహించారు. ఆమె కూడా ఆశించారు. కానీ ఎన్నికల తర్వాత, వైసీపీ అధికారంలోకి వచ్చాక, ఏదో ఒక నామినేటెడ్ పోస్టు ఇస్తామని జగన్ హామినిచ్చినట్టు వార్తలొచ్చాయి. వీలైతే రాజ్యసభ లేదంటే ఎమ్మెల్సీ అయినా ఆఫర్ చేస్తామన్నట్టుగా ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. ఏదో ఒక కార్పొరేషన్‌కు ఛైర్మన్‌ను చేసే అవకాశం కూడా వుందని, చర్చ జరిగింది. కానీ ప్రభుత్వం ఏర్పడి ఆరేడు నెలలు గడుస్తున్నా, లక్ష్మీ పార్వతికి, ఎలాంటి నామినేటెడ్‌ పోస్టూ ఇవ్వలేదు జగన్. దీంతో లక్ష్మీ పార్వతి సైలెంటయ్యారు. ఆమెనసలు పట్టించుకోవడంలేదని, చంద్రబాబుపై విమర్శలకు మాత్రం బాగా ఉపయోగించుకున్నారని, వైసీపీ అధిష్టానంపై కొందరు విమర్శలు చేశారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రోజా, వాసిరెడ్డి పద్మ లాంటి వారికి కీలకమైన పదవులు ఇచ్చిన సీఎం జగన్ లక్ష్మీపార్వతికి మాత్రం ఇంకా ఎలాంటి పదవి ఇవ్వలేదు. దీంతో ఆమె వైసీపీలో సైలెంట్ అయ్యారనే వార్తలు కూడా మొదలయ్యాయి. కానీ ఏపీఎస్‌ ఆర్టీసీ ఛైర్మన్‌ పదవిని కట్టబెట్టబెట్టే ఛాన్సుందన్న వార్తలు, లక్ష్మీ పార్వతి అభిమానుల్లో హుషారు నింపుతున్నాయి. ఆర్టీసీ ఛైర్మన్‌‌గా మొన్నటి వరకు బాధ్యతలు నిర్వహించిన టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య, మొన్నీమధ్యే ఆ పదవికి రాజీనామా చేశారు. ఖాళీ అయిన ఈ పోస్టును లక్ష్మీ పార్వతికి ఇచ్చే అవకాశముందని అమరావతిలో చర్చ జరుగుతోంది.

అయితే కీలకమైన ఈ నామినేటెడ్ పోస్టు కోసం, వైసీపీలో అప్పుడే రేసు మొదలైంది. కీలక నేతలంతా చక్రం తిప్పడం ప్రారంభించారు. వైసీపీలోని సీనియర్ నేతలైన అంబటి రాంబాబు సహా పలువురు నేతలు, ఈ పదవిని ఆశిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కోడెలను ఓడించి, పార్టీకి బలమైన గొంతుగా పని చేసిన తనకు మంత్రి పదవి ఇవ్వలేదని ఇప్పటికే అంబటి రాంబాబు, చాలా అసంతృప్తిగా వున్నారు. అందుకే ఆర్టీసీ చైర్మన్‌ పదవిని ఆయన గట్టిగా పట్టుబట్టే అవకాశముంది. అంబటి రేసులోకి రావడంతో, లక్ష్మీ పార్వతి వర్గంలో టెన్షన్‌ మొదలైంది. తనకు ఇస్తారా, లేదంటే అంబటికే ఇస్తారా, ఇద్దరికీ ఇవ్వకుండా మరొకరికి ఆఫర్ చేస్తారా అన్నది లక్ష్మీ పార్వతి అనుచరుల్లో ఉత్కంఠ కలిగిస్తోంది. చూడాలీ, ఆర్టీసీ స్టీరింగ్‌ ఎవరికి దక్కుతుందో, జగన్‌ ఎవరికి కట్టబెడతారో.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories