ఏపీకి ప్ర‌త్యేక హోదా ముగిసిన అధ్యాయం.. మ‌రోసారి తేల్చి చెప్పిన కేంద్రం..

AP Special Status: ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అంటూ కేంద్రం మరోసారి క్లారిటీ ఇచ్చింది.

Arun Chilukuri
Published on: 19 July 2022 5:21 PM IST
AP Special Status
X

ఏపీకి ప్ర‌త్యేక హోదా ముగిసిన అధ్యాయం.. మ‌రోసారి తేల్చి చెప్పిన కేంద్రం..

AP Special Status: ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అంటూ కేంద్రం మరోసారి క్లారిటీ ఇచ్చింది. మంగళవారం లోక్‌సభలో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రత్యేక హోదాపై అడిగిన ప్రశ్నకు.. కేంద్రమంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రత్యేక హోదాకు 14వ ఆర్థిక సంఘం ప్రాధాన్యత ఇవ్వలేదు. కేంద్రం పన్నుల్లో రాష్ట్రాల వాటా 42 శాతానికి పెంచాం. రెవెన్యూ లోటు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అదనపు నిధులు కేటాయించింది. 15వ ఆర్థిక సంఘం కూడా అవే సిఫార్సులను కొనసాగించింది. విభజన చట్టం హామీలను చాలావరకు నెరవేర్చాం. కొన్ని మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారానికి రెండు రాష్ట్రాల మధ్య 28 సమావేశాలు ఏర్పాటు చేశాం అని కేంద్ర మంత్రి వివరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story