ఏపీలో స్కూళ్లకు సెలవులు పొడిగింపుపై విద్యాశాఖ క్లారిటీ

NO Plans Extend Holidays Schools Says Adimulapu Suresh
x

ఏపీలో స్కూళ్లకు సెలవులు పొడిగింపుపై విద్యాశాఖ క్లారిటీ

Highlights

Holidays: ఏపీలో సెలవుల పొడిగింపుపై మంత్రి ఆదిమూలపు సురేష్ క్లారిటీ ఇచ్చారు.

Holidays: ఏపీలో సెలవుల పొడిగింపుపై మంత్రి ఆదిమూలపు సురేష్ క్లారిటీ ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పాఠశాలలను యథావిధిగా నడపాలని ఆలోచిస్తున్నామన్నారు. విద్యార్థుల ఆరోగ్య భద్రతపై కూడా నిఘా ఉంచామన్నారాయన. కొవిడ్ నిబంధనలు అనుసరిస్తూ పాఠశాలలు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. భవిష్యత్తులో కేసుల తీవ్రతను బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇక సెలవుల పొడిగింపు ఆలోచన లేదన్న మంత్రి ఆదిమూలపు సురేష్ ఉపాధ్యాయులకు వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తయ్యిందని తెలిపారు. 15 నుంచి 18 ఏళ్ల వయసు విద్యార్థులకు కూడా వ్యాక్సిన్ వేస్తున్నామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories