ఎన్నికకు నోచుకోని విజయపురి సౌత్.. గుంటూరు జిల్లాలోని ఈ గ్రామం గురించి తెలుసా?

విజయపురి సౌత్ గ్రామంలో 10 వేల మంది జనాభా ఎన్నికల్లో పాల్గొనేందుకు నోచుకోని 5 వేల మంది ఓటర్లు గుంటూరు జిల్లా మాచర్ల (మం)లోని విజయపురి సౌత్ వాసులు 2014 తర్వాత పైలాన్, హిల్ కాలనీలకు...
ఆ గ్రామం అసెంబ్లీ, ఎంపీ ఎన్నికలు తప్ప మరి ఏ ఇతర ఎన్నికలకు నోచుకోలేదు. 10 వేల జనాభా ఉన్న ఆ గ్రామంలో అభివృద్ధి మాత్రం శూన్యం. జిల్లా మొత్తంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతుంటే, ఆ గ్రామానికి మాత్రం ఆ భాగ్యం లేదు. స్వయం పరిపాలనకు నోచుకోని ఆ గ్రామంపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం.
ప్రపంచవ్యాప్తంగా పర్యాటక కేంద్రంగా పేరుపొందిన గుంటూరు జిల్లా మాచర్ల మండలంలోని నాగార్జునసాగర్ డ్యాం అంతర్భాగమైన విజయపురి సౌత్ ఇప్పటికీ స్థానిక సంస్థల పరిధిలోకి రాక నోటిఫైడ్ ఏరియా పరిధిలో ఉండి అభివృద్ధికి నోచుకోవడం లేదు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో మాచర్ల మండలం లోని తెలంగాణ సరిహద్దుకు విజయపురి సౌత్ ప్రారంభ గ్రామంగా స్వాగతం పలుకుతుంది. 2014 తర్వాత తెలంగాణ ప్రభుత్వం వారి పరిధిలోని పైలాన్, హిల్ కాలనీలకు నోటిఫైడ్ ఏరియా నుంచి తొలగించి మున్సిపాలిటీగా ఏర్పాటు చేసి రోడ్ల సౌకర్యం కల్పిస్తూ పర్యవేక్షిస్తున్నారు. కాని ఈ భాగ్యం విజయపురి సౌత్ కి దక్కలేదు. అటు పంచాయతీగా గానీ మున్సిపాలిటీగా కానీ గుర్తింపుకి కరువయ్యింది.
2014 ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో ప్రభుత్వానికి గ్రామస్తులు తమ గ్రామాన్ని పంచాయితీ చేయాలని ప్రతిపాదనలు పంపారు. జిల్లా ఉన్నతాధికారులు ఈ విషయంపై నామమాత్రంగా నోట్ రాసి వదిలేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ విషయంపై ఎటువంటి కదలికలు వచ్చిన పాపాన పోలేదు.
ప్రస్తుతం విజయపురిసౌత్ గ్రామంలో 10 వేల మంది జనాభా ఉన్నారు. అందులో 5 వేల మంది ఓటర్లు ఉన్నప్పటికీ పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనే భాగ్యం లేదు. తమ గ్రామాన్ని కూడా పంచాయతీగా గాని మున్సిపాలిటీగా గాని గుర్తించాలని వేడుకుంటున్నారు గ్రామ ప్రజలు. ఏదో ఒక భాగ్యాన్ని మాకు కలిపిస్తే మా గ్రామం కూడా అభివృద్ధి చెందుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ హయాంలో తాము ఎలగూ అభివృద్ధి భాగ్యానికి నోచుకోలేదని... ప్రస్తుత ప్రభుత్వమైన పట్టించుకొని విజయపూర్ ను పంచాయతీ గాని మున్సిపాలిటీ గాని తీర్చిదిద్దాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు.
బాలినేని హాట్ కామెంట్స్.. నాపై కుట్రలు జరుగుతున్నాయి.. సొంత పార్టీ నేతలే..
27 Jun 2022 1:39 PM GMTటీ హబ్-2 ప్రారంభానికి సిద్ధం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
27 Jun 2022 1:31 PM GMTరైతుబంధు పంపిణీ రేపటి నుంచే.. మొదటిసారి అర్హులైన వారికి అలెర్ట్.. అలా చేస్తేనే..
27 Jun 2022 1:15 PM GMTజూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
27 Jun 2022 1:00 PM GMTవ్యవసాయ బావిలో పడిన ఏనుగు.. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీ అధికారులు
27 Jun 2022 12:15 PM GMTపక్షుల కోసం ఆరంతస్తుల భవనం.. 2వేల పక్షులు నివసించే అవకాశం
27 Jun 2022 11:27 AM GMTBhimavaram: భీమవరంలో అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు
27 Jun 2022 11:04 AM GMT
బొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు
27 Jun 2022 4:00 PM GMTIndian Air Force 2022: నిరుద్యోగులకి శుభవార్త.. ఇండియన్ ఎయిర్...
27 Jun 2022 3:30 PM GMTపవన్ సినిమాలో సాయితేజ్ కు యాక్సిడెంట్..?
27 Jun 2022 3:00 PM GMTHealth Tips: ఈ టీలు రక్తాన్ని శుభ్రపరుస్తాయి.. రోజు తాగితే చాలా...
27 Jun 2022 2:30 PM GMTరేపు పారిస్కు వెళ్లనున్న సీఎం జగన్
27 Jun 2022 2:15 PM GMT