Eluru: బోరు బావిలో పడిపోయిన బాలుడు.. చాకచక్యంగా కాపాడిన స్థానిక యువకుడు

Eluru: ఏల్లూరు జిల్లా గుండుగోలనుకుంటలో బాలుడికి పెను ప్రమాదం తప్పింది.

Arun Chilukuri
Published on: 7 July 2022 2:07 PM IST
Nine Year old boy Fell in Borewell Rescued by Local Youth in Eluru
X

Eluru: బోరు బావిలో పడిపోయిన బాలుడు.. చాకచక్యంగా కాపాడిన స్థానిక యువకుడు

Eluru: ఏల్లూరు జిల్లా గుండుగోలనుకుంటలో బాలుడికి పెను ప్రమాదం తప్పింది. ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరుబావిలో పడ్డ 9ఏళ్ల బాలుడిని స్థానికులు కాపాడారు. బాలుడు 30 అడుగుల లోతులో ఓ రాయిపై చిక్కుకున్నాడు. మొదట బాలుడిని తాళ్ల సహాయంతో రక్షించే ప్రయత్నం చేశారు. అది వీలుకాక పోవడంతో స్థానిక యువకుడు నరేష్ తన నడుముకు తాడు కట్టుకొని బోరుబావిలో దిగి..బాలుడి నడుముకు తాడు కట్టి పైకి లాగారు. సుమారు 5గంటలకు పైనే బోరుబావిలో ఉన్న బాలుడు జస్వంత్ ఆరోగ్యంగా బయటపడటంతో గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story