ఏపీ ఎస్‌ఈసీ మరో సంచలన నిర్ణయం

ఏపీ ఎస్‌ఈసీ మరో సంచలన నిర్ణయం
x

ఏపీ ఎస్‌ఈసీ మరో సంచలన నిర్ణయం

Highlights

ఏపీ ఎస్‌ఈసీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు ఐఏఎస్‌లు, ఒక ఐపీఎస్‌పై వేటు వేశారు. విధుల నుంచి తప్పించాలని సీఎస్‌‌ను ఆదేశించారు. చిత్తూరు, గుంటూరు...

ఏపీ ఎస్‌ఈసీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు ఐఏఎస్‌లు, ఒక ఐపీఎస్‌పై వేటు వేశారు. విధుల నుంచి తప్పించాలని సీఎస్‌‌ను ఆదేశించారు. చిత్తూరు, గుంటూరు కలెక్టర్లను ఎన్నికల విధుల నుంచి తప్పించిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ జాయింట్ కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే తిరుపతి అర్బన్ ఎస్పీ, పలమనేరు, శ్రీకాలహస్తి డీఎస్పీలను కూడా ఎస్ఈసీ తొలగించింది. అంతేకాకుండా మాచర్ల, పుంగనూరు, రాయదుర్గం, తాడిపత్రి సీఐలను తొలగిస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. తొలగించిన అధికారుల స్థానంలో కొత్త అధికారుల పేర్లు పంపాలని సీఎస్‌కు ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది.


Show Full Article
Print Article
Next Story
More Stories