షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తాం : ఎస్‌ఈసీ

Nimmagadda Ramesh Kumar ON High Court Verdict
x
Highlights

ఏపీ హైకోర్టు తీర్పుతో ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీ సిద్ధమవుతోంది. షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది. ఇక త్వరలో సీఎస్‌,...

ఏపీ హైకోర్టు తీర్పుతో ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీ సిద్ధమవుతోంది. షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది. ఇక త్వరలో సీఎస్‌, డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహించి పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సమీక్షిస్తామని ఎస్‌ఈసీ తెలిపింది. వచ్చే నెల 5, 9, 13, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొంది. ఎన్నికల ప్రక్రియకు సహకరిస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలిపిందని ఎస్‌ఈసీ వెల్లడించారు.హైకోర్టు ఆదేశాల ప్రకారం 4 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. 'వచ్చే నెల 5, 9, 13, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే ఎన్నికల కోడ్ అమలులో ఉంది. సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధి ప్రజలను ప్రభావితం చేస్తుంది. ఈ విషయాన్ని సీఎస్‌ దృష్టికి తీసుకెళ్లాం?. ఎన్నికలకు సహకరిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. త్వరలో సీఎస్‌, డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహిస్తాం' అని ఎస్‌ఈసీ రమేష్‌ మీడియాకు వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories