Nimmagadda Ramesh: ఏపీలో వాలంటీర్లు ఎన్నికల నియమాలను ఉల్లంఘీస్తున్నారు

AP News: ఏపీలో వాలంటీర్లు ఎన్నికల ప్రచారం, రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటే వెంటనే సస్పెండ్‌ చేయాలని రాష్ట్ర మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.

Arun Chilukuri
Published on: 23 March 2024 4:38 PM IST
Nimmagadda Ramesh Kumar Meets Election Commissioner
X

Nimmagadda Ramesh: ఏపీలో వాలంటీర్లు ఎన్నికల నియమాలను ఉల్లంఘీస్తున్నారు

AP News: ఏపీలో వాలంటీర్లు ఎన్నికల ప్రచారం, రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటే వెంటనే సస్పెండ్‌ చేయాలని రాష్ట్ర మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. వాలంటీర్స్‌ను కేవలం సచివాలయానికి మాత్రమే పరిమితం చేయాలన్నారు. ఏపీలో వాలంటీర్లు ఎన్నికల నియమాలను ఉల్లంఘీస్తున్నారని...వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌ కుమార్‌ మీనాను కలిసి విజ్ఞప్తి చేశారు నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌. వాలంటీర్లు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని పేర్కొన్నారు. పెన్షన్లు, రేషన్‌ పంపిణీ కార్యక్రమాల్లో వాలంటీర్ల ప్రమేయం లేకుండా చూడాలన్నారు నిమ్మగడ్డ‌.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story