Governor appointment to Nimmagadda: నిమ్మగడ్డకు ఏపీ గవర్నర్ అపాయింట్మెంట్

Governor appointment to Nimmagadda: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ సోమవారం ఉదయం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ అవ్వనున్నారు.

Raj
By Raj
Updated on: 18 July 2020 8:29 AM IST
Governor appointment to Nimmagadda: నిమ్మగడ్డకు ఏపీ గవర్నర్ అపాయింట్మెంట్
X
Nimmagadda Ramesh Kumar (File Photo)

Nimmagadda Ramesh Kumar meet AP Governor: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ సోమవారం ఉదయం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ అవ్వనున్నారు. సోమవారం ఉదయం 11 గంటల 30 నిమిషాలకు కలవాలని గవర్నర్ ఆఫీసు నుంచి నిమ్మగడ్డను సమాచారం అందింది. దీంతో హైకోర్టు ఆదేశాలతో గవర్నర్ ను కలిసి వినతిపత్రం ఇవ్వనున్నారు నిమ్మగడ్డ. sec గా నిమ్మగడ్డను నియమించకపోవడం పట్ల హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా ఏపీ ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడిందని ఆయన పేర్కొన్నారు. అయితే కోర్టు ధిక్కరణ జరిగిందో లేదో తరువాత విచారిస్తామన్న న్యాయస్థానం.. నిమ్మగడ్డను రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమించాలన్న ఆదేశాలను ఎందుకు పాటించడం లేదని రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడింది. దీంతో గవర్నర్ ను కలవాలని ఆదేశించింది.

ఈ నేపథ్యంలో సోమవారం నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ తో భేటీ అయి తనను తిరిగి నియామకం చేయాలనీ కోరనున్నారు. ఇదిలావుంటే గతనెల ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఏపీ హైకోర్టులో మళ్లీ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు తనను ఎస్‌ఈసీగా నియమించాలని తీర్పు ఇచ్చినా అమలు చేయకుండా.. కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తోపాటు పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి, ఏపీ ఎన్నికల సంఘం కార్యదర్శిలను ప్రతివాదులుగా చేర్చారు.. నిమ్మగడ్డ తరపున లాయర్ అశ్వనీదత్ కుమార్ పిటిషన్ దాఖలు చేయగా.. హైకోర్టు విచారణకు స్వీకరించిన సంగతి తెలిసిందే.


Raj

Raj

Next Story