Nimmagadda: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఇప్పుడు సాధ్యం కాదు -ఏపీ ఎస్‌ఈసీ

Nimmagadda: స్థానిక ఎన్నికల నిర్వాహణపై ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టతనిచ్చారు.

Samba Siva Rao
Updated on: 24 March 2021 1:30 PM IST
Nimmagadda: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఇప్పుడు సాధ్యం కాదు -ఏపీ ఎస్‌ఈసీ
X

Nimmagadda: ఏపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ క్లారిటీ ఇచ్చారు. తాను ఎంపీటీసీ, జడ్పిటీసీల ఎన్నికలను నిర్వహించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశానుసారం ఎన్నికల తేదీ ఖరారు చేయాల్సి ఉందని వెల్లడించారు. దానికితోడు తాను మార్చి 31న రిటైరవుతున్న.... తన తర్వాత వచ్చే కమిషనర్‌ ఎన్నికలు నిర్వహిస్తారని తెలిపారు. ఇక రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ యుద్ధప్రాతిపాదికన జరుగుతోందన్నారు. వ్యాక్సినేషన్‌, కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ సముచితం కాదన్నారు ఎస్‌ఈసీ.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story