ఏపీ సర్కారుపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన ఎస్ఈసీ

Arun Chilukuri
Published on: 18 Dec 2020 5:51 PM IST
ఏపీ సర్కారుపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన ఎస్ఈసీ
X

హైకోర్టులో ఏపీ ఎస్ఈసీ రమేశ్ కుమార్ కోర్టు ధిక్కరణ పిటిషన్ ను దాఖలు చేశారు. ఎన్నికలకు సహకరించాలని హైకోర్టు ఆదేశించినా ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆరోపించారు. ఎన్నికల కమిషన్ రాసిన లేఖపైనా ప్రభుత్వం స్పందించలేదని, సీఎస్ స్పందన కూడా సరిగా లేదని తన తాజా పిటిషన్ లో తెలిపారు. ఎన్నికల విషయంలో తాము ఒక రాజ్యాంగబద్ధ సంస్థగా ముందుకు వెళుతున్నా గానీ, ప్రభుత్వం ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తోందని, ప్రభుత్వంపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story