Night Curfew: ఏపీలో మరోసారి నైట్ కర్ఫ్యూ పొడిగింపు

Night Curfew in Andhra Pradesh Extended Till September 4 2021
x

Night Curfew: ఏపీలో మరోసారి నైట్ కర్ఫ్యూ పొడిగింపు

Highlights

Night Curfew: కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాత్రిపూట కర్ఫ్యూను పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Night Curfew: కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాత్రిపూట కర్ఫ్యూను పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 4 వరకు రాత్రిపూట కర్ఫ్యూను పొడిగిస్తున్నట్టు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. అయితే కర్ఫ్యూ సమయంలో మరో గంట సడలింపు ఇచ్చినట్టు తెలిపింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వు ల్లో పేర్కొన్నారు. సడలింపు సమయాన్ని రాత్రి 10 గంటలకు బదులుగా, 11 గంటల వరకు పెంచినట్టు స్పష్టం చేశారు. ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రకటించారు. కర్ఫ్యూ అమలుపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories