NIA: కోడికత్తి దాడి ఘటనలో కుట్రకోణం లేదని కోర్టుకు తెలిపిన NIA

NIA: సీఎం జగన్‌పై కోడికత్తి దాడి ఘటనలో కీలక మలుపు

Jyothi
Published on: 13 April 2023 4:16 PM IST
NIA filed Counter in Kodi Kathi Case
X

NIA: కోడికత్తి దాడి ఘటనలో కుట్రకోణం లేదని కోర్టుకు తెలిపిన NIA

NIA: విశాఖ‌ ఎయిర్‌పోర్ట్‌లో సీఎం జగన్‌పై కోడికత్తి దాడి ఘటనలో కీలక మలుపు చోటుచేసుకుంది. కోడికత్తి దాడి ఘటనలో కుట్రకోణం లేదని కోర్టుకు తెలిపారు NIA అధికారులు. రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్‍కు ఘటనతో సంబంధం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నిందితుడు శ్రీనివాసరావు టీడీపీ సానుభూతిపరుడు కాదని, జగన్‌పై వ్యక్తిగతంగానే దాడి చేశాడని కోర్టుకు తెలిపారు. ఇక.. తనపై జరిగిన దాడి కేసులో జగన్‌ వేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని కోర్టును కోరారు NIA అధికారులు. తదుపరి వాదనలకు సీఎం జగన్‌ తరఫు న్యాయవాదులు సమయం కావాలని కోర్టును కోరడంతో.. తదుపరి విచారణ ఈ నెల 17కు వాయిదా పడింది.

Jyothi

Jyothi

Next Story