ఏపీ ప్రభుత్వానికి ఎన్జీటీ షాక్‌

Andhra Pradesh: మూడు రిజర్వాయర్ల పనులను నిలిపివేయాలని ఆదేశం.

Sriveni Erugu
Published on: 15 Feb 2022 9:02 AM IST
NGT Shock to AP Government‌
X

ఏపీ ప్రభుత్వానికి ఎన్జీటీ షాక్‌

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వానికి ఎన్జీటీ షాకిచ్చింది. చిత్తూరు జిల్లాలో చేపట్టిన మూడు రిజర్వాయర్ల పనులను నిలిపివేయాలని ఎన్జీటీ, ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అవులపల్లితో పాటు ఏపీలో చేపట్టిన మూడు రిజర్వాయర్లకు ఎన్జీటీ బ్రేక్ వేసింది. పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిందేనని ఎన్జీటీ స్పష్టం చేసింది. పర్యావరణాన్ని అంచనా వేయకుండా రిజర్వాయర్లను ఎలా చేపట్టారని ఎన్జీటీ ప్రశ్నించింది. తాగునీరు ఎంత అవసరమో పర్యావరణ పరిరక్షణ కూడా అంతే అవసరమని అభిప్రాయపడింది. పర్యావరణ అనుమతులు పొందిన తరువాతే ప్రాజెక్టులను ప్రారంభించాలని ఎన్జీటి ఆదేశించింది.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story