Home > ఆంధ్రప్రదేశ్ > Newly Elected YCP Rajya Sabha Members Takes Oath: వైసీపీ రాజ్యసభ సభ్యుల ప్రమాణం..
Newly Elected YCP Rajya Sabha Members Takes Oath: వైసీపీ రాజ్యసభ సభ్యుల ప్రమాణం..

X
Highlights
ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు నూతనంగా ఎన్నికైన వైసీపీ సభ్యులు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు....
Arun Chilukuri22 July 2020 7:09 AM GMT
ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు నూతనంగా ఎన్నికైన వైసీపీ సభ్యులు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా ఆళ్ల అయోధ్య రామిరెడ్డి హిందీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణారావు తెలుగులో ప్రమాణం చేశారు.
అనంతరం ఇతర రాష్ట్రాల నుంచి ఎన్నికైన సభ్యులతో రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు. ఇదిలా ఉంటే మరో వైఎస్సార్‌సీపీ సభ్యుడు పరిమళ్ నత్వానీ వ్యక్తిగత కారణాలతో ఇవాళ ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు. మరోరోజు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. 20 రాష్ట్రాల నుంచి మొత్తం 61 మంది సభ్యులు ఇటీవల రాజ్యసభకు ఎన్నికయ్యారు.
Web TitleNewly Elected YCP Rajya Sabha Members Takes Oath
Next Story