కొత్త మలుపు తిరిగిన గుంటూరు టోల్‌గేట్ వివాదం

X
Highlights
గుంటూరు జిల్లా కాజా టోల్‌ప్లాజా సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించిన ఘటన కొత్త మలుపు తిరిగింది. టోల్ ప్లాజా...
Arun Chilukuri10 Dec 2020 12:39 PM GMT
గుంటూరు జిల్లా కాజా టోల్‌ప్లాజా సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించిన ఘటన కొత్త మలుపు తిరిగింది. టోల్ ప్లాజా సిబ్బంది తనపై దురుసుగా ప్రవర్తించారని.. ఏపీ వడ్డెర కార్పొరేషన్ ఛైర్మన్ రేవతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు సిబ్బంది కూడా రేవతి పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా.. దారి ఇవ్వకపోతే చీర లాగారని సీఎంకు ఫిర్యాదు చేస్తానని రేవతి బెదిరింపులకు పాల్పడినట్టు ఎఫ్ఐఆర్ నమోదు అయింది. రేవతి వాహనం ఆగిపోవడంతో వెనకాల ట్రాఫిక్ జామ్ అయినట్టు.. దాన్ని క్లియర్ చేసేందుకు ప్రయత్నించామని టోల్ ప్లాజా సిబ్బంది ఫిర్యాదులో పేర్కొన్నారు.
Web TitleNew Twist In Guntur toll plaza issue
Next Story