రాహుల్ మర్డర్ కేసులో కొత్తకోణం.. హత్య కేసులో ఇద్దరు మహిళలు

Vijayawada: విజయవాడ రాహుల్ మర్డర్‌ కేసులో తవ్విన కొద్ది కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి.

Arun Chilukuri
Published on: 20 Aug 2021 5:22 PM IST
New Twist Emerges in Vijayawada Rahul Murder Case
X

రాహుల్ మర్డర్ కేసులో కొత్తకోణం.. హత్య కేసులో ఇద్దరు మహిళలు

Vijayawada: విజయవాడ రాహుల్ మర్డర్‌ కేసులో తవ్విన కొద్ది కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. రాహుల్ హత్య కేసులో ఇద్దరు మహిళల హస్తం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఓ మహిళ పాత్రపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కోరాడ విజయ్ కుమార్ ‌తో పాటు ఇద్దరు మహిళలు కూడా ఈ కేసులో ఉన్నట్టు అనుమానిస్తున్నారు. అంతేకాదు ఆ మహిళల ఇంటి సమీపంలో రాహుల్‌ను హత్య జరిగినట్టు తెలుస్తోంది.

మరోవైపు అనుమానితులుగా ఉన్న మహిళల సమక్షంలో గతంలో పలుమార్లు ఆర్థిక లావాదేవీలు, సెటిల్‌మెంట్‌ జరిగినట్టు తెలుస్తోంది. ఇంతకుముందు ఒకసారి మహిళలతో పాటు కోరాడ విజయ్ కుమార్‌ ఒంగోలు లోని రాహుల్ ఇంటికి కూడా వెళ్లినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. మహిళల కాల్ లిస్ట్‌ను సేకరిస్తున్నారు. ఇప్పటికే మహిళలను అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్టు తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story