MANSAS Trust: మాన్సాస్‌ ట్రస్ట్‌ వివాదంలో కొత్త మలుపు.. మహిళా కమిషన్‌ను ఆశ్రయించిన..

MANSAS Trust: మాన్సాస్‌ ట్రస్ట్ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది.

Arun Chilukuri
Published on: 30 Jun 2021 3:47 PM IST
New Turn in MANSAS Trust
X

MANSAS Trust: మాన్సాస్‌ ట్రస్ట్‌ వివాదంలో కొత్త మలుపు

MANSAS Trust: మాన్సాస్‌ ట్రస్ట్ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. రాష్ట్ర మహిళా కమిషన్‌ను ఆశ్రయించారు సంచయిత గజపతిరాజు. తనకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపించాలని కోరారు. సంచయిత తండ్రిపై అశోక్‌ గజపతిరాజు వ్యాఖ్యలు అహంకార పూరితమన్నారు మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ.

ముఖ్యంగా తన నియామకంతో పాటు వారసత్వం అంశాన్ని కించపరిచే రీతిలో అశోక్ గజపతిరాజు వ్యాఖ్యలు చేశారని సంచయిత పేర్కొన్నారు. దీనిపై వాసిరెడ్డి పద్మ స్పందించారు. అశోక్ గజపతిరాజు రాచరికపు వ్యవస్థలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. మాన్సాస్ ట్రస్ట్ బైలా పునః సమీక్షించాలని అన్నారు. సంచయిత విషయంలో అశోక్ చర్చకు సిద్దమని వాసిరెడ్డి పద్మ సవాల్ విసిరారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story