New Property Tax: రాజకీయంగా దుమారం రేపుతున్న కొత్త ఆస్తి పన్ను విధానం

New Property Tax: ఏపీలో ఆస్తి అద్దె ఆధారిత స్థానంలో విలువ ఆధారితంగా పన్నులు విధించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Arun Chilukuri
Updated on: 14 Jun 2021 12:59 PM IST
New Property Tax Process Creates Stir
X

రెప్రెసెంటేషనల్  ఇమేజ్ 


New Property Tax: ఏపీలో ఆస్తి అద్దె ఆధారిత స్థానంలో విలువ ఆధారితంగా పన్నులు విధించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పన్నులు పెంచుతూ ఇచ్చిన జీవోను వెనిక్కి తీసుకోవాలని లేనిపక్షంలో ఉద్యమం చేపడతామని విపక్షాలు హెచ్చరిస్తున్నాయి. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఆస్తి పన్నును పెంచుతూ జారీ చేసిన జీవో రాజకీయంగా దుమారం రేపుతోంది. నూతన పన్ను విధానంతో ఆస్తి పన్ను ప్రస్తుతమున్న దానికంటే ఏకంగా 3 నుంచి 20 రెట్ల మేర పెరగనుందని ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి.

ఇదిలా ఉంటె పట్టణాల్లో ఆస్తి విలువ ఆధారిత ఇంటి పన్ను, చెత్త పన్ను వేయడాన్ని నిరసిస్తూ ఈనెల 16, 17 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా వార్డు సచివాలయాల వద్ద నిరసనలకు ఆంధ్రప్రదేశ్‌ పట్టణ పౌర సమాఖ్య పిలుపునిచ్చింది. ఆస్థి పన్నును పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వామపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

కరోనాతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఆస్థి పన్ను పెంపు నిర్ణయం మూలిగెనక్క పై తాటిపండు పడినట్లు అయింది అని టీడీపీ నాయకులు అంటున్నారు. కనీసం కౌన్సిల్ లో తీర్మానం చేయకుండా నిర్ణయం ఎలా తీసుకుంటారు అని ప్రశ్నిస్తున్నారు. ఆస్తి పన్ను పెంచుతూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై బీజేపీ పార్టీ కూడా తీవ్రస్థాయిలో మండిపడుతుంది. లోపభూయిష్టంగా ఉన్న పన్నుల పెంపు జీవోను వేంటనే రద్దు చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటె మంత్రి బొత్సా సత్యనారాయణ మాత్రం పన్నుల పెంపు ఇప్పటి నిర్ణయం కాదని ఎన్నికల ముందే ఈ ప్రతిపాదన ఉందని అంటున్నారు. కావాలనే ప్రతిపక్షాలు పన్నుల పెంపు పై రాద్ధాంతం చేస్తున్నాయని వైసీపీ నాయకులు మండిపడుతున్నారు. ఏది ఏమైనప్పటికి రాష్ట్రంలో ఆస్థి పన్నును పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై రాజకీయంగా దుమారం రేపుతోంది. అఖిలపక్ష పార్టీలన్ని ఉద్యమ బాట పడుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story