టీటీడీకి కొత్త ఈవో

టీటీడీకి కొత్త ఈవో
x
Highlights

టీటీడీ ప్రస్తుత ఈఓ అనిల్ కుమార్ సింఘాల్‌ బదిలీ కానున్నారు. త్వరలో టీటీడీ ఈఓగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి జేఎస్వీ ప్రసాద్‌‌ను నియమించనున్నట్టు సమాచారం. ఈ...

టీటీడీ ప్రస్తుత ఈఓ అనిల్ కుమార్ సింఘాల్‌ బదిలీ కానున్నారు. త్వరలో టీటీడీ ఈఓగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి జేఎస్వీ ప్రసాద్‌‌ను నియమించనున్నట్టు సమాచారం. ఈ క్రమంలో అనిల్ కుమార్ సింఘాల్‌ను ఢిల్లీలోని ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా నియమించే అవకాశం ఉంది. జేఎస్వీ ప్రసాద్ ఉన్నత విద్యాశాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇప్పటికే ఈ పోస్టులో సతీష్ చందర్ ను ప్రభుత్వం నియమించింది. అనిల్ కుమార్ సింఘాల్ చంద్రబాబు హయాంలో టీటీడీ ఈవోగా నియమితులయ్యారు. ఆయన బదిలీ ఉత్తర్వులు మరికాసేపట్లో విడుదల కానున్నట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories