New Born Baby Boy Buried Alive: మాన‌వ‌త్వ‌మా.. నువ్వేక్క‌డ‌ ? ప‌సికందును పాతిపెట్టి పరార్

New Born Baby Boy Buried Alive: మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం వున్నవాడు.. ఈ ఘ‌ట‌న‌కు ప‌దాలు స‌రిగా స‌రిపోతాయి. అవును నిజమే మాన‌వ‌త్వం మంట క‌లిసే ఘ‌ట‌న‌నే.

Karampoori Rajesh
Published on: 5 Sept 2020 9:38 PM IST
New Born Baby Boy Buried Alive: మాన‌వ‌త్వ‌మా.. నువ్వేక్క‌డ‌ ? ప‌సికందును పాతిపెట్టి పరార్
X

New Born Baby Boy Buried Alive in East Godavari

New Born Baby Boy Buried Alive: మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం వున్నవాడు.. అనే ప‌దాలు ఈ ఘ‌ట‌న‌కు స‌రిగా స‌రిపోతాయి. అవును నిజమే మాన‌వ‌త్వం మంట క‌లిసే ఘ‌ట‌న‌నే.. కొంద‌రు పిల్ల‌ను ఎందుకు కంటారో తెలియ‌దు. ఎందుకు పారేస్తారో తెలియ‌దు. పిల్ల‌ల‌కు చిన్న దెబ్బ త‌గిలితేనే త‌ల్ల‌డిల్లి పోతాం.. అలాంటి అప్పుడే పుట్టిన ప‌సికందును .. క‌నీసం కండ్లు కూడా తెరువ‌ని మ‌గ శిశువును పూడ్చి పెట్టారు. మాన‌వ‌త్వానికి మ‌చ్చ తెచ్చే ఘ‌ట‌న తూర్పుగోదావరి జిల్లా ఏటపాక మండలం కిష్టవరం గ్రామంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది.

అప్పుడే పుట్టిన మగబిడ్డను బతికి ఉండగానే కొందరు దుండగలు పూడ్చి పెట్టారు. శిశువును పూడ్చిపెట్టిన విషయాన్ని గ్రామస్తులు గమనించి వెంటనే పూడ్చిన గొయ్యిని తవ్వి బయటకు తీసి చూడగా అదృష్టవశాత్తూ బిడ్డ బతికే ఉన్నాడు. దీంతో వెంటనే గ్రామస్తులు పసిబిడ్డను భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అలాగే గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు.ఆ శిశువు క్షేమంగా ఉన్నాడని చెప్పారు. త‌ల్లి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Karampoori Rajesh

Karampoori Rajesh

Next Story