New 108, 104 vehicles in Andhra Pradesh: కొద్దిసేపట్లో సరికొత్తగా ప్రజాసేవ లోకి కుయ్..కుయ్!

New 108, 104 vehicles in Andhra Pradesh: కొద్దిసేపట్లో సరికొత్తగా ప్రజాసేవ లోకి కుయ్..కుయ్!
x
Highlights

New 108, 104 vehicles in Andhra Pradesh: ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజారోగ్యం పై మరింత దృష్టి సాదించారు.

New 108, 104 vehicles in Andhra Pradesh: ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజారోగ్యం పై మరింత దృష్టి సాదించారు. ప్రధానంగా అత్యవసర సేవలందించే 108, 104 అంబులెన్స్‌లను ప్రజలకు మరింత అత్యాధునిక హంగులతో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఒకేసారి ఏకంగా 1,088 వాహనాలను (108–104 కలిపి) బుధవారం ఉదయం 9.35 గంటలకు విజయవాడలోని బెంజ్‌ సర్కిల్‌లో వద్ద జెండా ఊపి ప్రారంభించనున్నారు. అనంతరం ఈ వాహనాలన్నీ ఆయా జిల్లాలకు చేరుకుంటాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన 108, 104 సర్వీసులను గత ప్రభుత్వాలు నిర్వీర్యం చేయగా..ఇప్పుడు సీఎం జగన్‌ వాటికి అత్యాధునిక వైద్య సేవలను జోడించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు.

ఇక ఆధునిక వసతులతో కుయ్..కుయ్!

108 సర్వీసులో అనారోగ్యం లేదా ప్రమాదానికి గురైన వారికి అత్యాధునిక వైద్య సేవలందించే ఏర్పాట్లు చేశారు. 412 అంబులెన్స్‌లను కొత్తగా కొనుగోలు చేసి, ఈ సర్వీసు కోసం సిద్ధం చేయగా.. ఇప్పటికే ఉన్న వాటిలో 336 అంబులెన్స్‌లను కూడా వినియోగించనున్నారు. కొత్తగా సిద్ధం చేసిన 412 అంబులెన్స్‌లలో 282 బేసిక్‌ లైఫ్‌ సపోర్టు (బీఎల్‌ఎస్‌)కు సంబంధించినవి కాగా, 104 అడ్వాన్స్‌డ్‌ లైఫ్‌ సపోర్టు (ఏఎల్‌ఎస్‌)గా తీర్చిదిద్దారు. మరో 26 అంబులెన్స్‌లను చిన్నారులకు (నియో నేటల్‌) వైద్య సేవలందించేలా తయారు చేశారు.

ఏఎల్‌ఎస్‌ అంబులెన్స్‌లలో విషమ పరిస్థితిలో ఉన్న రోగిని ఆస్పత్రికి తరలించే సమయంలో కూడా వైద్య సేవలందించేలా అత్యాధునిక వెంటిలేటర్లు అమర్చారు. బీఎల్‌ఎస్‌ అంబులెన్స్‌లలో స్పైన్‌ బోర్డు, స్కూప్‌ స్ట్రెచర్, వీల్‌ ఛైర్, బ్యాగ్‌ మస్క్, మల్టీ పారా మానిటర్‌ వంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. నియో నేటల్‌ అంబులెన్స్‌లలో ఇన్‌క్యుబేటర్లతో పాటు, వెంటిలేటర్లను అమర్చారు. పట్టణ ప్రాంతాల్లో అయితే ఫోన్‌ చేసిన 15 నిమిషాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 20 నిమిషాల్లో, ఏజెన్సీ (గిరిజన) ప్రాంతాల్లో అయితే 25 నిమిషాల్లో అంబులెన్స్‌లు చేరే విధంగా ఆ స్థాయిలో సర్వీసులను ప్రారంభిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories