Roopkumar: నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్ వైసీపీకి రాజీనామా

Roopkumar: తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీకి రాజీనామా చేస్తున్నాం

Jyothi
Published on: 28 Feb 2024 6:32 PM IST
Nellore Deputy Mayor And Four Corporators Resigned From YSRCP
X

Roopkumar: నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్ వైసీపీకి రాజీనామా

Roopkumar: నెల్లూరులో వైసీపీకి షాక్‌ తగిలింది. నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్‌ కుమార్‌తో పాటు నలుగురు కార్పొరేటర్లు, మైనార్టీ నేతలు పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత, పార్టీలో నెలకొన్న పరిస్థితుల కారణంగానే గుడ్ బై చెప్పాల్సి వస్తోందన్నారు. ఇటీవల జరిగిన పరిణామాలు బాధించాయని చెప్పారు.వైసీపీ ఆవిర్భావం నుంచి సేవ చేశానని.. పార్టీ కోసం కష్టపడ్డాం.. పోరాడాం.. సొంతదిగా అనుకున్నామన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రాజీనామా చేస్తున్నామని.. తనను ఆదరించిన నెల్లూరు నగర ప్రజలు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు భవిష్యత్‌ కార్యాచరణపై అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.

Jyothi

Jyothi

Next Story