West Godavari: నిన్న రాత్రి నిట్‌ విద్యార్థి వంశీ కిడ్నాప్‌, హత్య

West Godavari: నిన్న రాత్రి నిట్‌ విద్యార్థి వంశీ కిడ్నాప్‌, హత్య * వంశీ తల్లిదండ్రులకు అగంతకుల ఫోన్‌

Sandeep Eggoju
Published on: 28 July 2021 4:13 PM IST
Neet Student Lost his Life after Kidnap in West Godavari District Nallajerla
X

Representational Image

West Godavari: పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం వెలుగుచూసింది. నిట్‌ విద్యార్థి వంశీ హత్యకు గురికావడం స్థానికంగా కలకలం రేపుతోంది. బాదంపూడికి చెందిన వంశీ గత రాత్రి బయటకు వెళ్లాడు. ఎంతసేపటికీ తిరిగిరాకపోవడంతో తల్లిదండ్రులు ఫోన్‌ చేయగా గుర్తుతెలియని వ్యక్తులు లిఫ్ట్ చేసి వంశీ తమ దగ్గరే ఉన్నాడని, 50 లక్షలు ఇస్తే వంశీని వదిలిపెడతామని చెప్పారు. తాము చెప్పిన ప్రదేశంలో డబ్బు పెట్టి వెళ్లాలని సూచించారు. దీంతో వంశీ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.

కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తుండగా ఇవాళ ఉదయం పోతవరంలోని ఓ మూతపడ్డ షుగర్‌ ఫ్యాక్టరీ దగ్గర వంశీ మృతదేహాన్ని గుర్తించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story