MP Navneet Kaur : మంత్రి రోజాకు మద్దతుగా నవనీత్ కౌర్.. బండారుపై ఆగ్రహం!

MP Navneet Kaur : మంత్రి రోజాకు మద్దతుగా నవనీత్ కౌర్.. బండారుపై ఆగ్రహం!

Shekhar G
Published on: 7 Oct 2023 6:10 PM IST
MP Navneet Kaur : మంత్రి రోజాకు మద్దతుగా నవనీత్ కౌర్.. బండారుపై ఆగ్రహం!
X

MP Navneet Kaur : మంత్రి రోజాకు మద్దతుగా నవనీత్ కౌర్.. బండారుపై ఆగ్రహం! 

Stars On Roja: మంత్రి రోజాపై మాజీమంత్రి బండారు సత్యనారాయణ కామెంట్స్ పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి రోజాపై బండారు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు మహారాష్ట్ర ఎంపీ, మాజీ సినీనటి నవనీత్‌ కౌర్‌. మంత్రి రోజాపై ఇంత దిగజారి మాట్లాడతారా..? అంటూ ఫైర్‌ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో మహిళలను చాలా గౌరవిస్తారు.. కానీ, బండారు సత్యనారాయణ మహిళల గౌరవాన్ని కించపరిచారని మండిపడ్డారు. రోజా సినీ పరిశ్రమకు సేవలందించారు. స్టార్‌ హీరోల సరసన నటించారు.

అలాంటి ఆమెను ఇంతలా కించపర్చడం కరెక్ట్‌ కాదు. రాజకీయాల్లో ఇంత దిగజారుడు సరికాదని హితవు పలికారు నవనీత్‌ కౌర్. ఇప్పటికే బండారు కామెంట్స్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు సినీనటులు కుష్బు, రాధిక. వారు కూడా రోజాకు మద్దతుగా నిలుస్తూ.. బండారు సత్యనారాయణ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు దిగజారుడు తనానికి నిదర్శనమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బండారు తక్షణమే మంత్రి రోజాకి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Shekhar G

Shekhar G

Next Story