IndraKeeladri: కాసేపట్లో ఇంద్రకీలాద్రికి చేరుకోనున్న ఏపీ సీఎం జగన్

IndraKeeladri:అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు

Sandeep Eggoju
Updated on: 12 Oct 2021 9:43 PM IST
Navaratri Celebrations on IndraKeeladri Temple
X

ఇంద్రకీలాద్రి పై నవరాత్రి వేడుకలు (ఫైల్ ఇమేజ్)

IndraKeeladri: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. కాసేపట్లో ఏపీ సీఎం జగన్ ఇంద్రకీలాద్రికి చేరుకోనున్నారు. ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. భద్రతా బలగాలు ఇంద్రకీలాద్రిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

ఇవాళ మూల నక్షత్రం కావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. మరో వైపు వీఐపీల తాకిడి పెరగడంతో సాధారణ భక్తుల దర్శనానికి ఆలస్యం అవుతోంది. సీఎం పర్యటన నేపధ్యంలో ఫ్లై ఓవర్ పై ట్రాఫిక్ క్రమబద్దీకరించారు. గతంలో కొండరాళ్లు జారిపడిన నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story