నర్సీపట్నం సబ్‌కలెక్టర్ మౌర్య సాహసం

నర్సీపట్నం సబ్‌కలెక్టర్ మౌర్య సాహసం
x
Highlights

అసలే అడవి ప్రాంతం. ఆ పై కొండలు గుట్టలు. రోడ్డు సౌకర్యం లేదు. ఆ గ్రామాలకు వెళ్లాలంటే కాలినడకను నమ్ముకోవాల్సిందే. అధికారులు అలాంటి ప్రాంతాలకు వెళ్లాలంటే...

అసలే అడవి ప్రాంతం. ఆ పై కొండలు గుట్టలు. రోడ్డు సౌకర్యం లేదు. ఆ గ్రామాలకు వెళ్లాలంటే కాలినడకను నమ్ముకోవాల్సిందే. అధికారులు అలాంటి ప్రాంతాలకు వెళ్లాలంటే చాలా కష్టమే. కానీ, గిరిజనులు కష్టాలను చూసిన కలెక్టర్ రెండు గంటల పాటు గుట్టలు ఎక్కుతూ.. అడవిలో నడిచి మారుమూల ఆదివాసి గ్రామానికి వెళ్లి పెద్ద సాహసం చేశారు.

విశాఖ జిల్లా రావికవతం మండలం చీమల పాడు గ్రామ పంచాయతీ పరిధిలోని చాలా గ్రామాలకు సరైనా రోడ్డు మార్గం లేదు. దాంతో అక్కడి వారు బయటకు రావాలంటే కాలినడకన రావాల్సిందే. ఈ క్రమంలో చాలా మంది గర్భిణీ స్త్రీలకు వైద్యం అందక ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఆదివాసీలు నర్సీపట్నం సబ్‌కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన చేపట్టారు. దీనికి చలించిన సబ్‌కలెక్టర్ కొండలు, గుట్టలు ఎక్కి చీమలపాడు గ్రామానికి చేరుకున్నారు. చలిసింగం గ్రామాన్ని సందర్శించి వారికి కావాల్సిన రోడ్డు, కనీస అవసరాలు ఏర్పాటు చేస్తామని సబ్‌కలెక్టర్‌ మౌర్య హామి ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories