Narendra Modi: నేడు ఏపీలో ప్రధాని మోడీ పర్యటన

Narendra Modi: చిలకలూరిపేట బహిరంగ సభలో పాల్గొననున్న మోడీ

Jyothi
Updated on: 17 March 2024 9:31 AM IST
Narendra Modi visit to AP today
X

Narendra Modi: నేడు ఏపీలో ప్రధాని మోడీ పర్యటన

Narendra Modi: పల్నాడు జిల్లాలో ప్రజా గళం సభకు సర్వం సిద్ధమైంది. బొప్పూడి సభతో టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్నికల శంఖారావం పూరిస్తున్నాయి. ప్రధాని మోడీ హాజరవుతున్న సభను మూడు పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నాయి.

టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు పొత్తు ఖరారైన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడిలో 300 ఎకరాల్లో సభాప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. ప్రజా గళం సభకు ప్రధాని నరేంద్ర మోడీ సాయంత్రం 4గంటలకు హాజరవుతారు.

300 ఎకరాల సభాప్రాంగణంలో 225 ఎకరాలు వాహనాల పార్కింగ్, ఏడు హెలిప్యాడ్‌లకు కేటాయించారు. 75 ఎకరాల విస్తీర్ణంలో సభావేదిక, వీఐపీ, ప్రజలకు వేర్వేరుగా బారికేడ్లతో గ్యాలరీలు ఏర్పాటు చేసారు. 8 అడుగుల ఎత్తులో ప్రధాన వేదిక నిర్మించారు. కూటమి సభ నిర్వహిస్తున్న బహిరంగసభకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ హాజరవుతున్నారు. ఎస్పీజీ సభా ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించటంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా వేశారు. ప్రధాని మోడీతోపాటు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌కళ్యాణ్‌ హాజరవుతున్నందున 7 హెలిప్యాడ్‌లు నిర్మించారు.

2014లో మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మళ్లీ పదేళ్ల తర్వాత ఇప్పుడే ముగ్గురు ఒకే వేదికను పంచుకుంటున్నారు. ప్రజాగళం సభను విజయవంతం చేసేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు భారీ ఎత్తున జనసమీకణ చేస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story