Modi: రేపు ఏపీలో నరేంద్ర మోడీ పర్యటన

Modi: కూటమి తరపున ప్రచారం చేయనున్న మోడీ

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 5 May 2024 7:30 PM IST
Narendra Modi to visit Andhra Pradesh Tomorrow
X

Modi: రేపు ఏపీలో నరేంద్ర మోడీ పర్యటన

Modi: ప్రధాని నరేంద్రమోడీ రేపు రాజమండ్రి రానున్నారు. కూటమి భాగస్వాములుగా ఉన్న టీడీపీ అధినేత, నారా చంద్రబాబు, జనసేన అధి నేత పవన్‌కల్యాణ్‌ కూడా రానున్నారు. రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి హాజరవుతారు. విజయ శంఖా రావం పేరుతో నిర్వహించే ఈ సభ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అడిషనల్‌ డీజీ అతుల్‌సింగ్‌ ఆధ్వర్యంలో పోలీసు భద్రతా ఏర్పాట్లు జరు గుతున్నాయి.

ఎస్‌పీజీ అధికారుల సూచనల మేరకు సభ వద్ద భద్రతాపరమైన చర్యలు చేపట్టారు. ఏలూరు రేంజ్‌ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్‌, తూర్పుగోదావరి ఎస్పీ జగదీశ్‌ భద్ర తా ఏర్పాట్లను చూస్తున్నారు. నలుగురు అడిషనల్‌ ఎస్పీలు, 8 మంది డీఎస్పీ లతోసహా మొత్తం 2,347 మంది పోలీస్‌ సిబ్బందిని ప్రధాని బందోబస్తుకు వినియోగిస్తున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story