సుప్రీంకోర్టులో మాజీ మంత్రి నారాయణకు ఊరట

SSC Paper Leak Case: సుప్రీం కోర్టులో టీడీపీ మాజీ మంత్రి నారాయణకు ఊరట లభించింది.

Arun Chilukuri
Published on: 6 Jan 2023 1:41 PM IST
Narayana Gets Relief in Supreme Court
X

సుప్రీంకోర్టులో మాజీ మంత్రి నారాయణకు ఊరట

SSC Paper Leak Case: సుప్రీం కోర్టులో టీడీపీ మాజీ మంత్రి నారాయణకు ఊరట లభించింది. పేపర్‌ లీకేజ్‌ కేసులో హైకోర్టు రిమాండ్‌ ఆర్డర్‌పై సుప్రీం కోర్టు స్టే విధిస్తూ ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. నారాయణ తరఫున సీనియర్‌ కౌన్సిల్‌ సిద్ధార్ధ లూద్రా, గుంటూరు ప్రమోద్‌, గుంటూరు ప్రేరణలు కోర్టులో వాదనలు వినిపించారు. న్యాయమూర్తులు రవీంద్రభట్, దీపాంకర్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం కేసును విచారించింది.

గతంలో నారాయణకు చిత్తూరు జిల్లా కోర్టు మాజిస్ట్రేట్ బెయిల్ ఇచ్చారు. హైకోర్టు బెయిల్ రద్దు చేసి నారాయణను సరెండర్ కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై సుప్రీంకోర్టు నేడు స్టే ఇచ్చింది. గత ఏడాది ఏప్రిల్‌ - మే నెలలో పదో తరగతి పరీక్షల నిర్వహణ సందర్భంగా ప్రశ్నా పత్రాలు లీక్ కావడం సంచలనం సృష్టించింది. ప్రశ్నా పత్రాలు లీక్ కావడానికి నారాయణ విద్యా సంస్థలే కారణమని పోలీసులు కేసులు నమోదు చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story