ఆదర్శ దంపతులకు అసలైన నిర్వచనమయ్యారు మీరు!: లోకేశ్

ఆదర్శ దంపతులకు అసలైన నిర్వచనమయ్యారు మీరు!: లోకేశ్
x
Highlights

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దంపతుల పెళ్లి రోజు ఇవాళ. 1981 సెప్టెంబర్ 10న చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు మూడుముళ్ల...

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దంపతుల పెళ్లి రోజు ఇవాళ. 1981 సెప్టెంబర్ 10న చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, నందమూరి అభిమానులు చంద్రబాబు, భువనేశ్వరి దంపతులకు అభినందనలు తెలుపుతున్నారు. ఇలా అందరికీ ఆదర్శంగా నిలుస్తూ.. మరెన్నో వివాహ వార్షికోత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా వారి ఫొటోను పోస్ట్ చేస్తూ వారి కుమారుడు నారా లోకేశ్ శుభాకాంక్ష‌లు తెలిపారు. "అమ్మానాన్నలకు పెళ్లిరోజు శుభాకాంక్షలు! ప్రజల కోసం ఒకరు, కుటుంబం కోసం మరొకరు శ్రమిస్తూనే... ఒకరి ఆశయాలకు మరొకరు అండగా నిలిచి, ఆదర్శ దంపతులకు అసలైన నిర్వచనమయ్యారు మీరు. మీరిలాగే ఆది దంపతుల్లా కలకాలం మా కళ్ల‌కు పండువ‌గా నిలవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను" అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.Show Full Article
Print Article
Next Story
More Stories