Nara Lokesh: విద్యార్థుల పాలిట జగన్‌రెడ్డి కంసుడు - లోకేష్‌

Nara Lokesh: మొండిగా ముందుకెళ్లడం జగన్‌ మూర్ఖత్వానికి నిదర్శనమని విమర్శించారు

Sandeep Eggoju
Published on: 28 April 2021 5:24 PM IST
Nara Lokesh: Nara Lokesh Warning To Andhra Pradesh CM Jagan Mohan Reddy
X

నారాలోకేష్ అండ్ సీఎం జగన్ (ఫైల్ ఇమేజ్)

Nara Lokesh: విద్యార్థుల పాలిట సీఎం జగన్‌ కంసుడుగా మారారని టీడీపీ నేత లోకేష్‌ అన్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా ఉన్నా పరీక్షలు నిర్వహించడం.. మొండిగా ముందుకెళ్లడం జగన్‌ మూర్ఖత్వానికి నిదర్శనమని విమర్శించారు. రాష్ట్రంలో ఆక్సిజన్‌ లేక జనం పిట్టల్లా రాలిపోతున్నారని తెలిపారు. పరీక్షల పేరుతో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడటం సరికాదని హెచ్చరించారు. ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా మరణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అన్ని తరగతుల పరీక్షలను వాయిదా వేసింది.

అయితే టెన్త్, ఇంటర్ పరీక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా రగడ కొనసాగుతోంది. వద్దని విపక్షాలు మొత్తుకుంటుంటే పెట్టి తీరుతామంటోంది అధికార పక్షం. విద్యార్థుల భవిష్యత్ కోసమే పరీక్షలు పెడుతున్నామన్నారు సీఎం జగన్. దీంతో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు చంద్రబాబు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story