Nara Lokesh: చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై నారా లోకేశ్ ట్వీట్.. ఏదైనా జరిగితే సీఎం జగన్ బాధ్యత వహించాలి

Nara Lokesh: ఏపీ ప్రభుత్వం చంద్రబాబు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేస్తోంది

Shekhar G
Published on: 13 Oct 2023 12:46 PM IST
Nara Lokesh Tweet On Chandra Babu Health Condition
X

Nara Lokesh: చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై నారా లోకేశ్ ట్వీట్.. ఏదైనా జరిగితే సీఎం జగన్ బాధ్యత వహించాలి

Nara Lokesh: జైల్లో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి రిస్క్ లో ఉందన్నారు నారా లోకేశ్. ఇప్పటికే చంద్రబాబు బరువు తగ్గడం, కలుషిత నీటితో ఇబ్బందులు పడుతున్నారని ట్వీట్ చేశారు లోకేశ్. రోజు రోజుకు చంద్రబాబు ఆరోగ్యం క్షీణిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. సరైన సమయంలో చంద్రబాబుకు చికిత్స అందడంలేదని ఆరోపించారు లోకేశ్. చంద్రబాబు ఆరోగ్యం పట్ల ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. ప్రభుత్వ డాక్టర్లు, మరియు అధికారులు ఏం దాచడానికి ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు లోకేశ్. చంద్రబాబుకు ఏదైనా హాని జరిగితే సీఎం జగన్ బాధ్యత వహించాలని అన్నారు లోకేశ్.


Shekhar G

Shekhar G

Next Story